Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గూగుల్ పిక్సల్2, పిక్సల్2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ ఫోన్ ధరలపై భారీ తగ్గింపు!

  • ప్రారంభంలో రూ.61వేలు, రూ.73వేలతో మార్కెట్లోకి
  • రెండుసార్లు తగ్గించిన గూగుల్
  • సిటీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్
ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ గత ఏడాది విడుదల చేసిన పిక్సల్2, పిక్సల్2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్ ధరలపై భారీ తగ్గింపు ప్రకటించింది. భారత మార్కెట్లో తొలిసారి ప్రవేశపెట్టినప్పుడు వీటి ప్రారంభ ధరలు రూ.61వేలు, రూ.73వేలుగా ఉండేవి. అయితే గత డిసెంబర్ నెలలో ఈ ఫోన్ల ధరలను గూగుల్ మొదటిసారి కాస్త తగ్గించింది. కాగా రెండోసారి తాజాగా ఈ ఫోన్లపై రూ.11000, రూ.8000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీనికి తోడు సిటీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్లను కొంటే అదనంగా మరో రూ.8వేలు, రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ కూడా లభిస్తుంది. ఈ నెల 28వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఫోన్లను కొనుగోలు చేసిన 90 రోజులకు క్యాష్ బ్యాక్ వస్తుంది.

డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ కలుపుకుని గూగుల్ పిక్సల్ 2 ఫోన్ల ధర :

గూగుల్ పిక్సల్ 2 (64 జీబీ) - రూ.41,999
గూగుల్ పిక్సల్ 2 (128 జీబీ) - రూ.50,999

గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ ఎల్ (64 జీబీ) - రూ.54,999
గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ ఎల్ (128 జీబీ) - రూ.63,999
google
pixel2
smartphone
price

More Telugu News